రాష్ట్రంలోని అధికార పార్టీ కుమ్ములాటల్లో పాల్గొంటున్న వారు పైకి ఏమి చెబుతున్నా అసలు వాస్తవం అవినీతి సొమ్ములో వాటాల గొడవేన్నది స్పష్టం. వైఎస్‌ రాజశేఖర రెడ్డి మరణానంతరం గత 14 మాసాల్లో జరిగిన రాజకీయ పరిణామాలకు పరాకాష్టగా పార్టీ అధిష్టానం రోశయ్యను అప్రజాస్వామిక రీతిలో 'తొలగించి', కిరణ్‌ కుమార్‌ రెడ్డిని కొత్త ముఖ్యమంత్రిగా నియమించడం, దాంతో జగన్మోహన్‌ రెడ్డి కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకోవడం చకచకా జరిగిపోయాయి.

ఇంకా

వర్గపోరాటాన్ని తీవ్రతరం గావించటం కోసం తమ యావశ్ఛక్తినీ దారపోసి, సాంఘిక విప్లవ సాధనకోసం ఎన్నో కష్టాలకోర్చి, ఎనలేని త్యాగాలు చేసిన వీరవనితలు ప్రపంచ కార్మికో ద్యమానికి కొదవగాదు. కాని అటువంటి వీర వనితలకే వీరత్వం నేర్పిన మహా నేత్రి ఆమె. ''పాదాల దగ్గర పడి బ్రతకటం కంటే తన కాళ్ళపై నిలబడి చావటం మంచిదని'' దాదాపు 50 సంవత్సరాల క్రితం తొలిసారిగా ఆమె ఉచ్ఛరించిన మాటలు నేటికీ అదే స్ఫూర్తితో ధ్వనిస్తున్నాయి. ఏడు శతాబ్దాలకు పైగా ఆమె కార్మికవర్గ ఆశయ సాధనకోసం అవిరళ పోరా టం జరిపారు. అచంచలమైన అంకితభావం, నిబద్ధత, త్యాగనిరతి ఆమెను కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌ కార్యనిర్వాహకవర్గ కమిటీ సభ్యు రాలి స్థాయికి చేర్చాయి.

ఇంకా

రాష్ట్రంలో విస్తృత స్థాయిలో పార్టీ స్టడీ సర్కిల్స్‌ జరుగుతున్నాయి. మార్క్సిస్టు మౌలిక సిద్థాంత గ్రంథాలపై జరుగుతున్న ఈ స్టడీ సర్కిల్స్‌లో కార్యకర్తలకు కొన్ని విషయాలపై వివరణలు కావాల్సి వస్తోంది. పార్టీ రాష్ట్ర కేంద్రం నుండి ప్రతినెలా మార్క్సిస్టులో కార్యకర్తలు కోరిన వివరణలు ఇస్తారు. మీ ప్రశ్నలను కింది అడ్రసుకు పంపగలరు:

తమ్మినేని వీరభద్రం (స్టడీసర్కిల్స్‌ రాష్ట్ర ఇంఛార్జి),
సిపిఐ(ఎం) కార్యాలయం,
సుందరయ్య భవనం,
ఖమ్మం.

ఇంకా