రాజధాని నిర్మాణం కారణంగా ఉపాధి కోల్పోయిన వ్యవసాయ కూలీలకు రోజుకు 300చోప్పున నెలకు 9వేల రూపాయలు ఇవ్వాలని, అవి కుడా ఏప్రిల్ నెల నుండి లెక్కకట్టి ఇవ్వాలని, రైతులకు ఏవిధంగా అయితే రాజధాని ప్రాంతంలో సంపూర్ణ రూణమాఫీ చేశారో అదే విధంగా డ్వాక్ర మహిళలకు కూడా సంపూర్ణ రుణమాఫీ చేయాలని సిఆర్ డిఎ కార్యలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో రాజధాని ప్రాంతా గ్రామాల ప్రజలు ధర్న కార్యక్రమం నిర్వహించారు..ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు, కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు తదితరులు పాల్గొన్నారు .