కార్మిక చట్టాల సవరణలపై సదస్సు..

కార్పొరేట్‌ సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాసోహ మయ్యాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్సివర్గ సభ్యులు ఎంఎ గఫూర్‌ విమర్శించారు. నెల్లూరులో జరిగిన కార్మిక చట్టాల సవరణల సదస్సుల్లో ఆయన ప్రసంగించారు. కార్మికులకు సమ్మె చేసే హక్కును కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం చట్ట సవ రణ చేస్తోందన్నారు. ఒక పథకం ప్రకారం కార్మిక సంఘాల ను నిర్వీర్యం చేసేందుకు నరేంద్రమోడీ ప్రయత్నిస్తున్నారని అన్నారు. బిజెపి మిత్రపక్షమైన టిడిపి కూడా కార్మిక వ్యతిరేక చట్టాలు తెచ్చిందన్నారు. మార్చి 26న కార్మిక చట్టాలకు సవ రణ చేసే బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపిందన్నారు. ఈ బి ల్లును వైసిపి కూడా అడ్డుకోలేదని కార్మికులు గుర్తించాలన్నా రు. కార్మికులు, ఉద్యోగులు ఆందోళన చేస్తే ఉక్కుపాదంతో అణచివేస్తానంటూ చంద్రబాబునాయుడు నిరంకుశత్వం ప్రద ర్శిస్తున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబరు రెండో తేదీ జరి గే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశా రు.