ద‌ళితుల‌కు భూమి ద‌క్కే వ‌ర‌కు ఐక్య‌పోరాటం

దేవరపల్లి దళుతుల భూపోరాటానికి మద్దతుగా సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై.వి, రాష్ట్ర కమిటి సభ్యులు సిద్దయ్య తదితర స్థానిక నాయకులు పర్యటించారు. దళితుల భూముల్లో అక్రమంగా చెరువులు తవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామని,70 సం|| రాలుగా దళితులు  సాగుచేసుకున్న భూమి వారికే దక్కేవరకూ సిపిఎం పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.