బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ దాడులకు వ్యతిరేకంగా

కేరళ వామపక్ష ప్రజాతంత్ర ప్రభుత్వంపై బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నిరసిస్తూ సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. సిపిఎం కార్యాలయాలపై ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి గూండాల దాడులను సిపిఎం కార్యకర్తలు, నేతలు తీవ్రంగా ఖండించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే సిపిఎంపై దాడులకు పాల్పడుతున్నారని, 90 ఏళ్ల దేశ చరిత్రలో ఉన్నడూ లేని విధంగా ఒక రాజకీయపార్టీ కార్యాలయాల ముందు మరో రాజకీయ పార్టీ ఆందోళనలు నిర్వహించడం ఇదే తొలిసారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. విశాఖలోనూ ఇదే తరహాలో దాడులు చేశారని, ఇదే విధంగా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వం వ్యవహరిస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. దేశంలో సిపిఎంపై బిజెపి దాడులను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యాన సోమవారం విజయవాడ పాత బస్‌స్టాండు నుండి లెనిన్‌ సెంటర్‌ వరకూ నిరసన ప్రదర్శన నిర్వహించారు.