రైతాంగ సమస్యల పరిష్కారం కోసం

Submitted by admin on Sat, 2010-12-25 20:13

Date: 
December 13, 2010

రైతాంగ సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ప్రతిపక్ష పార్టీ నాయకుడు చంద్రబాబుతో పాటు, జూలకంటి రంగారెడ్డి, గుండా మల్లేష్ మొదలగు తెలుగుదశం _ వామపక్ష శాసనసభ్యులను అరెస్టు చేయడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) త్రీవంగా నిరసిస్తున్నది.
రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అఖిలపక్ష రైతు సంఘాల నాయకులకు అనుమతి ఇవ్వలేదు. దానికి నిరసనగా ఆందోళన చేస్తున్న రైతు నాయకులను, వారికి మద్దతుగా ఆందోళన చేస్తున్న శానససభ్యులను అరెస్టు చేసారు. వారిని విడుదల చేయాలని కోరుతూ ఆందోళన జరిపిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుతో సహా, పలువురు ఎమ్మేల్యేలను అరెస్టు చేయడం గర్హనీయం. ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా రైతు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

(బి.వి. రాఘవులు)
కార్యదర్శి