సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం

Submitted by admin on Sat, 2010-12-25 19:25

Date: 
October 12, 2010

ఈ రోజు హైదరాబాదులోని ఎంబి భవన్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం పాటూరు రామయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాఘవులు మాట్లాడారు. తీసుకున్న అప్పులు చెల్లించాలంటూ సూక్ష్మ రుణ సంస్థలు ప్రజలపై ఒత్తిడి తీసుకొ చ్చి దాడులు, దౌర్జన్యాలకు పూనుకోవడం వల్ల రాష్ట్రంలో ఇప్పటి వరకు 30 ఆత్మహత్యలు చేసుకున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు విమర్శించారు. ఇవి ఆత్మహత్యలు కావని.... సూక్ష్మ రుణ సంస్థలు చేస్తున్న 'మైక్రో హత్యలని` అభివర్ణించారు. ప్రజల్ని ఈ విధంగా త్మహత్యలకు పురికొల్పుతున్న సూక్ష్మ రుణ సంస్థలపై మర్డర్ కేసులు బనాయించాలని డిమాండ్ చేసారు. ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలకు రూ. 5 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని రాఘవులు డిమాండ్ చేసారు. సమస్యకు పరిష్కారం వెదకాల్సిన ముఖ్యమంత్రి రోశయ్య ఈ అంశం కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకు పరిధిలోకి వస్తుందంటూ నిస్సహాయత వ్యక్తం చేయడం శోచనీయమని అన్నారు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియకపోతే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్ాటు చేయాలని డిమాండ్ చేసారు. అందులో వచ్చిన సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా సమస్యను పరిష్కరించాలని సూచించారు.
ప్రభుత్వం గతంలో రాష్ట్రంలోని 64 వేల కౌలు రైతుల గ్రూపులకు రూ. 750 కోట్ల రుణాలను అందిస్తామంటూ ప్రకటించిందని తెలిపారు. ఇందులో 5 వేల గ్రూపులకు కేవలం రూ. 150 కోట్ల రుణాలను మాత్రమే ఇచ్చారని వివరించారు. ఈ రుణం కింద ఇంకా రూ. 600 కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్ాపరు. రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాలకు పావలా వడ్డీ కింద రూ. 11,778 కోట్ల రుణాలను అందిస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పటి వరకు కేవలం రూ. 1236 కోట్లను మాత్రమే చెల్లించిందని అన్నారు. ఇస్తామని చెప్పిన రుణంలో ఇది కేవలం 11 శాతం మాత్రమేనని తెలిపారు. ప్రభుత్వం కౌలు గ్రూపులు, స్వయం సహాయక గ్రూపులకు ఇస్తానన్న రుణం సకాలంలో ఇవ్వపోవడంతో ఆయా గ్రూపులు మైక్రో ఫైనాన్స్ సంస్థల మీద ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొందని చెప్ాపరు. సదరు సంస్థలు ప్రజల వద్ద నుండి 40 నుండి 50 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తున్నాయని తెలిపారు. వీటిని నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించింది. అప్ుపలు చెల్లించాలంటూ ప్రజల్ని మానసికంగా, శారీరకంగా వేధిస్తున్న సూక్ష్మ రుణ సంస్థలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం పోలీసులకు నిర్ధిష్టమైన ఆదేశాలివ్వాలని రాఘవులు కోరారు.
లెవీ బియ్యం సేకరణలో ప్రభుత్వం కొ త్త విధి విధానాల్ని రూపొందించడం వల్ల రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయబోమంటూ రైస్ మిల్లర్లు ప్రకటించడం న్యాయం కాదని న్నారు.అ సమస్యలేమైనా టే ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించుకోవాలి తప్ప రైతుల్ని ఇబ్బంది పెట్టడం సరైంది కాదని అన్నారు.
అనేక సంవత్సరలుగా జైళ్లల్లో మగ్గుతూ సత్పప్రవర్తన కలిగిన జీవిత ఖైదీల విడుదల విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని రాఘవులు విమర్శించారు. విడుదలలో జాప్యానికి ప్రభుత్వమే కారణం తప్ప ఖైదీలు కాదని చెప్పారు. ప్రభుత్వం కాలయాపన చేయకుండా వారిని దసరా పండుగ సందర్భంగా విడుదల చేయాలని సూచించారు.
రాష్ట్రంలో శాంతి భ్రదతల పరిస్థితి ఘోరంగా తయారయిందని విమర్శించారు. మహిళల మీద అఘాయిత్యాలు, దళితులపై దాడులు నానాటికీ పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకునేంఉదకు కూడా ఆందోలనలు చేయాల్సిన దుస్థితి రాష్ట్రంలో నెలకొందని అన్నారు. ఎస్టిమేట్స్ కమిటీ సమావేశం జరగబోతున్న దృష్ట్యా ఆ మీటింగ్లో పై విషయాలన్నింటిపై సమ్రగ నివేదిక తెప్పించకుని సమీక్ష జరపాలని సూచించారు.
ఈ కాలంలో స్థానిక సమస్యలపై పార్టీ చేపట్టిన ఉద్యమాల గురించి సమీక్షించామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ప్రజలకు హాని చేస్తున్నాయని విమర్శించారు. గతంలో ప్రజలకిచ్చిన హామీలు, నిర్ణయాలు అమలు కాలేదన్నారు.