District News

 

 తిరుపతి సి.పి.యం.ఆఫీసు నందు 'రైతు జీవితం' షార్ట్ ఫిలిమ్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి.శ్రీనివాసరావు, యండపల్లి శ్రీనివాసరెడ్డి (MLC) , ఆర్పీఐ నాయకులు అంజయ్య తదితరలు

సమాన విద్య-ఉపాధి గ్యారంటీ కోసం రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమని పలువురు సిపిఎం, సిపిఐ నాయకులు, ప్రజాప్రతినిధులు అన్నారు. సమాన విద్య-ఉపాధి గ్యారెంటీ కోసం వామపక్ష పార్టీల రాజకీయ ప్రత్యామ్నాయంపై తిరుపతి యశోధనగర్‌లోని ఎంబి భవన్‌లోకోసం రౌండ్‌టేబుల్‌ సమావేశం ఆదివారం జరిగింది. దీనికి సిపిఎం తిరుపతి జిల్లా కార్యదర్శి అంగేరి పుల్లయ్య, సిపిఐ కార్యవర్గ సభ్యులు చిన్నంపెంచులయ్య అధ్యక్షత వహించారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారామ్‌, ఎంఎల్‌సి యండపల్లి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ దేశంలో రాజకీయ దివాళాకోరుతనానికి బిజెపి, రాష్ట్రంలో టిడిపిలు నిదర్శనంగా నిలుస్తున్నాయని చెప్పారు. విద్యారంగంలో ప్రయివేటీకరణ, మతోన్మాద విధానాలు చొప్పించే...

చిత్తూరు జిల్లాలో దళితులు తీవ్రమైన వివక్ష ఎదుర్కొంటున్నారు. వివక్ష రూపుమాపేందుకు అధికారయంత్రాంగం చొరవతీసుకోవాలి. లేకుంటే పోరాటం తప్పదని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు హెచ్చరించారు. తనకు కులంపైన నమ్మకం లేదని సిఎం చెబుతున్నారు...మరి సొంత జిల్లాలో కుల వివక్షపై మీ స్పందన ఏమిటని ప్రశ్నస్తున్నాను. కుల వివక్ష ముఖ్యమంత్రికే సిగ్గుచేటు. టిటిడికి ఒకరినయినా ఈవోగా నియమించారా. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే టిటిడి ఈవో గా దళితులను నియమించసలి. గతంలో దళితగోవిందం పూజలుచేసిన శ్రీవారి విగ్రహాలను గోదాముల్లో పడేశారు. ఇది వివక్ష కాదా. కబ్జా అయిన దళితుల భూములను తిరిగి వారికి అప్పగించాలి. దళితులను ఆలయాల్లోకి అనుమతించకుంటే మేమే ఉత్సవాలు నిర్వహించి...

తిరుపతిలో  స్మార్ట్ సిటీ పేరుతో పారిశుద్ధ్య కార్మికుల కాలనీ తొలగింపునకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అశోక్ నగర్ 'స్కావింజర్స్ కాలనీ' లో  స్మార్ట్ సిటీ పేరుతో 250 ఇళ్ళు తొలగించి అపార్ట్ మెంట్ కట్టాలని ప్రయత్నిస్తుండడంతో కాలనీ వాసులు ప్రతిఘటించారు. సిపియం కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి. కృష్ణయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు కందారపు మురళి తదితరులు కాలనీ వాసులను కలసి వారికి అండగా పోరాడుతామని హామీ ఇచ్చారు 

రాయలసీమ కరువు నివారణచర్యలు తీసుకోవాలని కోరుతూ వామపక్షాల ఆద్వర్యంలో కడపలో శాంతియుతంగా బంద్ నిర్వహిస్తున్న సిపిఎం, సిపిఐ కార్యకర్తలను పోలీసులు అరెస్టులు చేశారు.రాయలసీమలో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నా ప్రభుత్వంలో చలనం లేదని , బంద్‌ నిర్వహిస్తామనగానే జూన్‌ రెండు నుంచి ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని సిపిఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి మ‌ధు అన్నారు. హామీల అమ‌లు మాటల‌లో కాకుండా చేతల్లో చూపించేందుకు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం పై ఒత్తిడి పెంచాల్సిన అవసరముందని, కరువు సహాయక చర్యలు తక్షణం చేపట్టాలని , అదే విధంగా ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీనివ్వాలని మ‌ధు డిమాండ్ చేశారు.

Pages