భవన నిర్మాణ కార్మికులకు అండగా సిపిఎం

ఇసుక కొరత వల్ల పనుల్లేక ఆకలితో అలమటిస్తున్న భవన నిర్మాణ కార్మికులకు సిపిఎం అండగా ఉంటుందని, కార్మికులు ధైర్యంగా ఉండాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి శ్రీనివాసరావు అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కార్మికులు అర్ధాకలితో, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటే వారి కష్టాలను ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడం అత్యంత దుర్మార్గమని అన్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లాలో ఆకలి బాధలు, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఏడుగురు భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుండి ఒక్కో కార్మిక కుటుంబానికి రూ.10వేలు పరిహారం తక్షణమే అందజేయాలని డిమాండ్‌ చేశారు. కార్మికుల సమస్యల్ని ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేకుంటే తదుపరి జరిగే విపత్కర పరిస్థితులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.