వామపక్ష పార్టీలు
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 08 నవంబర్, 2023.
పాలస్తీనాపై ఇజ్రాయల్ దాడులను ఖండిస్తూ
నవంబర్ 10న నిరసనలు
గాజాపై ఇజ్రాయెల్ ఏకపక్షంగా చేస్తున్న యుద్ధం నెల రోజులు దాటింది. వేలాదిమంది ఈ మారణకాండలో బలవుతున్నారు. శరణార్ధుల శిబిరాలపై బాంబుదాడులు జరుగుతున్నాయి. పసిపిల్లలు, మహిళలు, పౌరుల శవాల గుట్టలు హృదయవిదారకంగా ఉన్నాయి. ప్రపంచంలో అనేక దేశాలలో ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా అమెరికా ప్రోత్సాహంతో ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు.
కాబట్టి పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను తక్షణమే ఆపివేయాలని కోరుతూ నవంబరు 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలని వామపక్ష పార్టీలు నిర్ణయించాయి. ఈ నిరసన కార్యక్రమాలలో ప్రజలు, ప్రజాస్వామ్య వాదులు, మేధావులు, పెద్దఎత్తున పాల్గొని పాలస్తీనాకు సంఫీుభావం ప్రకటించి జయప్రదం చేయాలని కోరుతున్నాము.
(వి.శ్రీనివాసరావు)
సిపిఐ(యం)
(కె.రామకృష్ణ)
సిపిఐ
(వై.సాంబశివరావు)
సిపిఐ(యంఎల్) న్యూడెమోక్రసీ
(జాస్తి కిషోర్‌బాబు)
సిపిఐ(యంఎల్)
(కాటం నాగభూషణం)
యంసిపిఐ(యు)
(యన్.మూర్తి)
సిపిఐ(యంఎల్) లిబరేషన్
(బి.ఎస్. అమర్‌నాథ్)
యస్‌యుసిఐ(సి)
(పి.వి.సుందరరామరాజు)
ఫార్వర్డ్‌బ్లాక్
(జానకి రాములు)
రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ