దుష్పరిపాలనపై ప్రజాగ్రహం ఎన్నికల ఫలితాలపై సిపిఐ(యం)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 04 జూన్‌, 2024.

దుష్పరిపాలనపై ప్రజాగ్రహం

ఎన్నికల ఫలితాలపై సిపిఐ(యం)

సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై వేసిన భారాలు, విచ్చలవిడి అవినీతి, అరాచక పాలన, నిరంకుశ విధానాల పట్ల ప్రజాగ్రహం వ్యక్తమైంది. ఇది ఫలితాల్లో ప్రతిబింబించింది. రాష్ట్రంలో బిజెపి పోటీ చేసిన ఆరు పార్లమెంటు స్థానాల్లో మూడు స్థానాల్లో ఓడిరచడం రాష్ట్రానికి కేంద్రం చేసిన ద్రోహానికి ప్రజల స్పందన.

రాష్ట్రంలో రెండు శిబిరాల మధ్య హోరా హోరీ పోటీ నడిచిన నేపథ్యంలో ‘ఇండియా బ్లాకు’ పార్టీలకు ఆశించిన స్థాయిలో ఓట్లు రాలేదు. అయినా అరకు పార్లమెంటులో సిపిఐ(యం)కు లక్షకు పైగా ఓట్లు రావడం హర్షణీయం. రంపచోడవరం అసెంబ్లీ స్థానంలో గతంకన్నా ఓట్లు పెరిగాయి. అలాగే సిపిఐ(యం) పోటీ చేసిన ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు మిగతా రాష్ట్రంలో ఇండియా బ్లాకు పార్టీలకు ఓటు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం.

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి