ఏ.పి.ఎస్‌ ఆర్‌.టి.సి రిటైర్డ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించమని కోరుతూ....

ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. ` జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

 

విజయవాడ,

 తేది : 24 జూలై, 2024.

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,  

గౌరవ ముఖ్యమంత్రి,   

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, 

అమరావతి.

 

విషయం: ఏ.పి.ఎస్‌ ఆర్‌.టి.సి రిటైర్డ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించమని కోరుతూ....

 

అయ్యా!

 

రాష్ట్రంలో ఆర్‌టిసిలో పనిచేసి రిటైర్డ్‌ అయిన వారు 40 వేలమంది ఉన్నారు. నూటికి 60 మందికి ఇ.పి.ఎస్‌ - 95 కేంద్ర పెన్షన్‌ స్కీమ్‌ ద్వారా నెలకు రూ.1,000/-లు, మరికొందరికి రూ.2,500/- ల వరకు చేతికి అందుచున్నాయి. ఇవి కూడా వారు సర్వీసులో ఉండగా జీతంలో మినహాయించిన పైకం నుండి ఇ.పి.ఎస్‌ -95 పెన్షన్‌కు జమ చేసుకుని ఇస్తున్నారు. ఈ ఆదాయంతో రిటైర్డ్‌ ఎంప్లాయి, తన భార్య జీవనం సాగించడం కష్టం.

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాల ద్వారా వారికి ఎలాంటి సహాయం అందడంలేదు. పేదలకు ఇచ్చే తెల్లరేషన్‌ కార్డు, వృద్ధాప్య పెన్షన్‌ పథకం, ఆరోగ్యశ్రీ మొదలగునవి ఏవీ ఆర్టీసి రిటైర్డ్‌ ఉద్యోగులకు వర్తించడం లేదు. కావున తమరు జోక్యం చేసుకుని రిటైర్డ్‌ ఆర్‌టిసి ఉద్యోగులకు తెల్లరేషన్‌ కార్డు, వృద్ధాప్య పెన్షన్‌, ఆరోగ్యశ్రీ మొదలగు ప్రభుత్వ పథకాలు వర్తించేట్లుగా అవసరమైన ఆదేశాలు జారీ చేయగలరని కోరుతున్నాను.

 

అభివందనములతో...

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి