
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 21 సెప్టెంబరు, 2024.
టిటిడిలో అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి.
సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్
తిరుమల తిరుపతి దేవస్ధానంలో లడ్డూల నాణ్యతపై వస్తున్న వార్తలు, అవినీతి, అక్రమాలపై వస్తున్న కథనాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపధ్యంలో లడ్డూల నాణ్యత, నెయ్యి కల్తీతో సహా మొత్తం టిటిడిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.
లడ్డూల నాణ్యత, నేయి కల్తీపై జూలైలోనే ఎన్‌డిడిబి నుండి నివేదిక వచ్చినప్పటికీ చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేసింది. ఇప్పటికైనా ప్రజల్లోనూ, భక్తుల్లోనూ వస్తున్న ఆందోళనలను తొలగించి, విశ్వాసాన్ని కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.
ఈ సందర్భాన్ని అవకాశంగా తీసుకొని సంఫ్‌ు పరివార్ సహా, మతోన్మాద శక్తులు ప్రజల్లో భావోద్రేకాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. భక్తుల్లో అపోహలు సృష్టించి, ఇతర మతస్ధులపై విద్వేషాన్ని పెంచేందుకు ఈ శక్తులు ప్రయత్నిస్తున్నాయి. మతోన్మాదుల స్వార్థపర రాజకీయ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండి, సామరస్యంగా వ్యవహరించాలని ప్రజలకు సిపిఐ(యం) విజ్ఞప్తి చేస్తున్నది.
రాజకీయ పార్టీలు అగ్నికి ఆజ్యం పోయకుండా సంయమనం పాటించాలని, ప్రధానంగా అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మరింత బాధ్యాతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
Andhra Pradesh Committee
H.No. 27-30-9,
Akula vari Street,
Governorpet,
Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org