కడపఉక్కు పరిశ్రమకు ద్రోహం చేసిన కేంద్రం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది :04 డిసెంబర్‌, 2024.

కడపఉక్కు పరిశ్రమకు ద్రోహం చేసిన కేంద్రం

కడప స్టీల్‌ప్లాంట్‌ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్‌.డి. కుమారస్వామి ప్రకటించడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది. రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా కడపలో నిర్మించాల్సిన ఉక్కుపరిశ్రమపై కేంద్రమంత్రి ప్రకటన వెనుకబడిన రాయలసీమ ప్రజలను మోసం చేయడమే. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ప్రభుత్వరంగంలోనే కడపలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు తగు చర్యలు చేపట్టాలని సిపిఐ(యం) డిమాండ్‌ చేస్తున్నది.
కడపలో ప్రభుత్వరంగంలో ఉక్కు పరిశ్రమ స్థాపిస్తామని, రాయసీమ అభివృద్ధికి 16 డిమాండ్లతో కూడిన రాయలసీమ డిక్లరేషన్‌ను బిజెపి 2018 ఫిబ్రవరి 22న కర్నూలులో ప్రకటించింది. గత పది సంవత్సరాలుగా కడప ఉక్కుపరిశ్రమ నిర్మాణం పై హామీ ఇస్తూ వచ్చిన బిజెపి ఇలా మాటమర్చడం గర్హనీయం.  రాష్ట్ర ప్రభుత్వం దీనిపై తన వైఖరి స్పష్టం చేయాలి. తెలుగుదేశం, జనసేన పార్టీ మద్ధతుతో కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ రాష్ట్రానికి మేలు చేయకపోగా తీరని ద్రోహం చేస్తున్నది. ఇప్పటికే విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తున్నది.
2007 జూన్‌10న కడప ఉక్కు పరిశ్రమకు మొట్టమొదటిసారి కాంగ్రెసు ముఖ్యమంత్రి వైఎస్‌. రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసారు. ఆ తర్వాత చంద్రబాబు 2018లో, జగన్మోహన్‌రెడ్డి 2019లో మరియు 2023లో శంకుస్థాపనలు చేసారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో ప్రభుత్వరంగంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు ఉపాధితో పాటు, అభివృద్ధి చెందుతుంది. కడప ఉక్కు ఫాక్యర్టీ పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసించాలని, దాని సాధనకై ప్రజలు, ప్రజాతంత్రవాదులు ఉద్యమించాలని సిపిఐ(యం) విజ్ఞప్తి చేస్తున్నది.

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి

 

--

COMMUNIST PARTY OF INDIA (MARXIST)
            Andhra Pradesh Committee

H.No. 27-30-9,

Akula vari Street,
Governorpet, 

Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org