పట్టణ ప్రజల నడ్డి విరిచే ఆస్తి పన్ను పెంపును వ్యతిరేకించండి

సోదరి, సోదరులారా!

పట్టణాల్లో ఆస్తిపన్ను ను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దపడింది . పట్టణ ప్రజలపై రాష్ట్ర వ్యాప్తంగా సుమారు వెయ్యి కోట్ల రూపాయాల అధనపు భారం పడుతుంది. మున్సిపల్‌ సేవలని ప్రవేటీకరించడం ప్రజలపై భారం పెంచి ఆధాయం పెంచాలని ప్రపంచ బ్యాంక్‌ షరతులకు అనుగుణంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. కేంద్ర 13వ ఆర్ధికసంఘం గ్రాంట్లు, సంస్కరణల పేర్లు చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌ ఒకటి నుంచి ఆస్తి పన్ను పెంచేందుకు సిద్దమైంది. ప్రతీయేటా ఆస్తి పన్నులు సమీక్షించి పన్నులు నిర్దారించేందుకు కొత్తగా ఆస్తి పన్ను బోర్డు ఏర్పాటు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ధరల భారంతో కుంగిపోతున్న ప్రజలకు ఉపశమనం కలిగించాల్సింది పోయి ప్రభుత్వం మరిన్ని భారాలు మోపుతున్నది. ఆస్తి పన్నులను పెంచ బోమంటూ ఎన్నికల ముందిచ్చిన హామీలను విస్మరించింది. పట్టణ ప్రజలపై తీవ్ర భారాన్ని మోపే ఆస్తి పన్ను పెంపు చర్యలను ఉపసంహరించుకోవాలని సిపిఐ(యం) ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నది.

రాష్ట్ర కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, తాత్కాలిక ఉద్యోగులందరికీ జీ.. నెం.3 అమలు చేయ్యాలి.

రాష్ట ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, యూనివర్సిటీలు పథకాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, దినసరి, పార్ట్‌ పార్ట్ టైం, కంటింజెంట్, గౌరవ వేతన, పారితోషికాలపై పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యొగులందరికీ జి..3 ప్రకారం వేతనాలను చెల్లించాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది. జి..3 అమలుకై పై కేటగిరీ ఉద్యోగులందరూ ఐక్యంగా కదిలి రావాలని సిపిఐ(యం) కోరుతున్నది.

నేడు రాష్ట్ర ప్రజానీకం ఎదుర్కొటున్న సమస్యలతో పాటు, పై ఉద్యోగులందరికీ జి..3 ప్రకారం వేతనాలను చెల్లించాలని డిమాండు చేస్తూ సిపిఐ(యం) మార్చి 17 నుండి నిరవధిక దీక్షలు చేపట్టింది. వేలాదిమందితో మార్చి 22న చలో అసెంబ్లీ నిర్వహించింది. ప్రభుత్వ శాఖలలో ఖాళీలలో నియమించిన వారికే జి..3 వర్తింస్తుందంటూ ప్రభుత్వం అరకొర వేతనాలతో బ్రతుకులీదుస్తున్న తాత్కాలిక ఉద్యోగులకు వేతనాలను పెంచలేమంటున్నది. ఎం.ఎల్‌.., ఎం.ఎల్‌.సి.లకు మాత్రం వారేదో కటిక దారిద్ర్యంలో మగ్గుతున్నారన్నట్లు వేతనాలు/ అలవెన్సులను రూ.95,000/ లకు పెంచింది.

ఎస్టీ నోడల్ ఏజెన్సీకి నిధులివ్వాలి- గిరిజన ఆవాసాల అభివృధ్ది పథకం ప్రారంభించాలి

ప్రజలారా!

రాష్టంలో 20 వేల గిరిజన గూడేలు, తండాలు, కాలనీల్లో నివసిస్తున్న 60 లక్షల మంది గిరిజనులు తరతరాలుగా అభివృధ్ది లో వివక్షకు గురవుతూఅన్ని రకాలుగా వెనుకబడి ఉన్నారు. గిరిజన సబ్‌ప్లాన్‌ ప్రకారం(టిఎస్ పి ) రాష్ట్ర ప్రణాళికా బడ్జెట్‌లో గిరిజనులకు 6.6 శాతం నిధులు కేటాయించి ఖర్చు చేయాల్సి ఉన్నా 3 శాతం కూడా దాటటం అది లేదు. దారి మళ్ళించిన, కోత విధించిన నిధులను తిరిగి గిరిజనుల అభివృధ్దికి కేటాయించి ఖర్చు చేయలన్న జాతీయ ప్రణాళికా సంఘం జాతీయ ఎస్సీ,ఎస్టీ నోడల్‌ ఏజెన్సీలు ఏర్పడినా అవి కాగితాలకే పరిమితమయ్యింది.

ఎస్సీ, ఎస్టీలకు బడ్జెట్లో వాటా అమలుకై పోరాడుదాం

ప్రజలారా!

రాష్ట్రంలో దళిత, గిరిజనులు నివాస ప్రాంతాలు అభివృధ్దిలో వెనుకబడి ఉన్నాయి. రాష్ట్ర బడ్జెట్‌లో నిధిలు కేటాయించి ఖర్చు చేయడంలో వివక్ష పాటిస్తున్నది. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక ప్రకారం రాష్ట్ర ప్రణాళిక బడ్జెట్‌లో ఎస్సీలకు 16.2 6.6 శాతాం కేటాయించి ఖర్చు చేయాలి. రెండింటికి కలిపి 10 శాతం కూడా ఖర్చు చేయడంలేదు. గతంలో నిర్వహించిన ఉద్యమాల వల్ల ముఖ్యమంత్రి అధ్యక్షతన ఎపెక్స్ కమిటీ, ఎస్సీ, ఎస్టీ నోడల్‌ ఏజెన్సీని ఏర్పాటు చేసినా కాగితాల వరికే పరిమితమయ్యింది. గత 19 సంవత్సారాల్లో ఎస్సీ, ఎస్టీలకు ఖర్చు చేయల్సిన నిధుల్లో రు 26,604 కోట్లు కోత విధించారు. దారి మళ్ళించిన , కోత విధించిన నిధులను తిరిగి కేటాయించాలన్న జాతీయ ప్రణాళికా సంఘం, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమీషన్‌ సూచనలు అమలు జరగడం లేదు. రాష్ట్రంలో 57 వేల దళిత వాడలు , 20 వేల ఆవాసాలున్నాయి. కోత విధించిన నిధులతో 30 లక్షల కుటుంబాలకు పక్కాఇళ్ళు, 60 లక్షల కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు, 40 వేల వాడలకు రక్షిత మంచినీరు \, అప్రోచ్ రోడ్లు, 15 వేల వాడలకు విద్యుత్ కనెక్షన్లు, వీధిలైట్లు, 1500 సంక్షేమ హాస్టళ్ళకు స్వంత భవనాలు నిర్మించవచ్చు.

ప్రజాపంపిణీని దెబ్బతీసే నగదు బదిలీ ప్రతిపాదనను తిప్పికొట్టాలి

నేరుగా నగదు బదిలీ చేసే పథకాన్ని వచ్చే ఏడాది నుండి అమలు చేయాలని కేంద్ర బడ్జెట్ ప్రకటించింది.ఆహారం, ఎరువులు, ఇంధనం సబ్సిడీలలో పెద్దేత్తున 'లీకేజీలు' చోటుచేసుకొటున్నందున ఇది అవసరమని తెలిపింది. పేదలకు బియ్యం,కిరోసిన్, గ్యాస్, గోధుమలు, పంచదార, తదితర నిత్యజీవితావసర సరుకులపై ఇస్తున్న సబ్సిడీలకు కోతపెట్టడానికి, పేదలకు అందించే రాయితీలకు కుదించడానికి ఇది ఒక ముసుగు తప్ప మరేమి కాదు.

లీకేజీలకు ప్రభుత్వం సరైన విధంగా చూడటం లేదు. సార్వత్రిక విధానం స్థానంలో లక్షిత ప్రజాపంపిణీ విధానం ప్రవేశపెట్టిన తర్వాత లీకేజీలు రెట్టింపు అయ్యాయని పదకొండవ పంచవర్ష పత్రాలు తెలిపాయి. లక్సిత పంపిణీ వ్యవస్థ కన్నా ఎక్కువ కవరేజి కలిగిన రాష్ట్రాలలో లీకేజి చాలా తక్కువగా ఉంది. అందుచేత లీకేజీలను నివారించాలంటే సార్వత్రిక విధానానికి తిరిగి వెళ్ళడం, ఆన్‌లైన్‌ లాంటి ఆధినిక పద్దతుల్లో అజమాయిషీని పటిష్టంచేయడం ఉత్తమ మార్గం.ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న నగదు బదిలీ పథకం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయి.

నగదును దారిద్ర్య రేఖకు దిగివున ఉన్న బిపిఎల్ కుటుంబాలకే పరిమితం చేయడంతో ఎంపికలో పొరపాట్లు, మినహాయింపులు కొనసాగుతాయి. దేశంలోని పేదల్లో మూడింట రెండువంతుల మందికి బిపిఎల్ కార్డులు కాని, అంత్యోదయ కార్డులు కాని లేవని అధికార లెక్కలే చెపుతున్నాయి. బిపిఎల్ జాబితా నుండి మినహాయించబడిన పేదలు నగదు బదిలీ పథకం నుండి కూడ మినహాయించబడతారు.

నగదు బదిలీ పథకం మొదలయిన వెంటనే ఇంధనం, ఎరువులు, ఆహారం ధరలపై నియంత్రణ పూర్తిగా ఎత్తివేయబడుతుంది. మార్కెట్ దయాదాక్షిణ్యాలకు వదిలివేయడం జరుగుతుంది. బహిరంగ మార్కెట్లో ధరలు ఎంత ఆకస్మికంగాను, వేగంగాను పెరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాము. కాని ఆ ధరలకు అనుగుణంగా నగదు బదిలీ పరిమాణం మాత్రం పెరగదు.

ఎరువులు సబ్సిడీని కూడ పేదరిక రేఖకు దిగువున ఉన్న కుటుంబాలకే ఇస్తామంటున్నారు. అప్పుడు సబ్సిడీ అందుకే వారు దాదాపు ఎవ్వరూ ఉండరు. ఎందువల్లనంటే భూమికలిగిన వారిలో అలాంటి వారు దాదాపు ఎవ్వరూ ఉండరు. ఈ పరిస్తితిలో రైతుల్లో ఎరువుల సబ్సిడీని అందుకునే వారిని ఎలా ఎంపింక చేస్తారు?

యుఐడి/ఆధార్ నంబరు పథకాన్ని సబ్సిడీలకు, ఇతర సంక్షేమ పథకాలకు అనుసంధానం చేసేందుకు నగదు బదిలీ పథైకం ప్రయత్నిస్తుంది. యూఐడి కోసం అనుసరిస్తున్న వేలిముద్రలు, కంటిపాపల ఫొటోల ఆధారంగా పనిచేసే బయోమెట్రిక్ విధానం మంచి చెడ్డలు ఇంకా రుజువు కాలేదు, దానికి ఎంత ఖర్చవుతుందో కూడ తెలియదు. యుఐడి సమాచారాన్ని తయారు చేయడం, నిర్వహించడానికి అయ్యే ఖర్చు ప్రస్తుత సబ్సిడీ మొత్తం కన్నా చాల ఎక్కువ ఉంటుందనడంలో సందేహం లేదు.

నేరుగా బదిలీ చేసిన నగదును దాన్ని ఉద్దేశించిన సరుకునే కొనుగోలు చేయడానికి వినియోగిస్తారన్న గ్యారంటీ లేదు. పురుషాధిక్యం కొనసాగుతున్న ఈ సమాజంలో ఆ మొత్తం కుటుంబ పెద్దగా ఉన్న పురుషుని ఇష్టా ఇష్టాల ప్రకారం ఖర్చు పెట్టుకొనే అవకాశమే హెచ్చు.

నగదు బదిలీపై ప్రభుత్వానికి అంతగా మోజు ఉంటే ప్రస్తుత సబ్సిడీలకు అదనంగా దాన్ని ప్రవేశపెట్టాలి. కాని సబ్సిడీలను ఎత్తివేసి వాటి స్థానంలో ప్రవేశపెడితే మాత్రం తీవ్రంగా వ్యతిరేకించి తిప్పికొట్టాలని సిపిఐ(ఎం) ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నది.

అభివందనాలతో....

భారత కమ్యూనిస్టుపార్టీ(మార్క్సిస్టు)

ఆంధ్రప్రదేశ్ కమిటీ, హైదరాబాదు

ఫిబ్రవరి 28 రాష్ట్ర బంద్, సార్వత్రిక సమ్మెలను జయప్రదం చేయండి. --- వామపక్షాల పిలుపు.