ఏపీ విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో వామపక్ష నేతలు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. విభజన నేపథ్యంలో అన్యాయానికి గురైన ఏపీకి న్యాయం చేయాలనే డిమాండ్ తో చేస్తున్న వామపక్ష నేతల ఆందోళనలను పోలీసులు అడ్డుకున్నారు.రోడ్డుపై సిపిఎం,సీపీఐ నేతలు బైఠాయించటంతో వారిని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.
పార్టీ కార్యక్రమాలు
చింతపూడి భూనిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేస్తున్న నిర్వాసితులతో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు. ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శిస్తున్న రాష్ట్రకార్యదర్శిమధు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారం, ఇతర నాయకులు కార్యకర్తలు..
బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ కొనసాగుతోంది. బడ్జెట్‌లో రాష్ట్రానికి ఇవ్వాల్సిన వాటిని ఇవ్వకుండా అన్యాయం చేసిన కేంద్రం, ప్రశ్నించకుండా ప్రజలను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు పిలుపునిచ్చారు.విభజన చట్టంలో ఇస్తామని హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం, రాజధాని నిర్మాణానికి నిధులేవీ బడ్జెట్‌లో దక్కలేదన్నారు. చంద్రబాబు కేంద్రంతో కలిసి నాటకాలాడుతున్నారని, కేంద్రం దగ్గర ఒక మాట, ఇక్కడ మరో మాట చెబుతున్నారని విమర్శించారు.
దళితులపై దాడులకు నిరసనగా ఈనెల 23న చలో గుంటూరు నిర్వహిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు తెలిపారు. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పెదగొట్టిపాడును మధు ఆధ్వర్యంలో సిపిఎం బృందం శుక్రవారం సాయంత్రం సందర్శించింది. డిసెంబరు 31, జనవరి ఒకటిన దళితులపై పెత్తందార్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. దాడికి గురైన దళితులను మధు పరామర్శించిన అనంతరం గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధితులకు న్యాయం చేకూరే వరకూ అండగా పోరాటం చేస్తామని ప్రకటించారు. గొట్టిపాడు ఘటనపై ఈనెల 23న రాష్ట్రంలోని దళితులందర్నీ సమీకరించి 'చలో గుంటూరు' నిర్వహిస్తామని ప్రకటించారు. గ్రామంలో దళిత వాడలో కనీస సౌకర్యాలు లేవని, వారు తీవ్ర వివక్షతకు...
గోట్టిపాడు దళితులపై జరిగిన దాడిని నిరసిస్తూ సిపిఎం నాయకులు చేపట్టిన పర్యటనలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి మధు, కార్యదర్శి వర్గ సభ్యులు వి కృష్ణయ్య ఇతర నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసారు.దళితులపై దాడుల సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం పెత్తందార్లకు వత్తాసు పలుకుతోందని మధు విమర్శించారు. గొట్టిపాడులో దళితులపై దాడి చేసిన కులోన్మాదుల్ని 307 సెక్షన్ కింద అరెస్ట్ చేయాలని, దళితులపై మోపిన అక్రమ కౌంటర్ కేసులు ఎత్తివేయాలని, దళితులకు ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేసి, ఆ పంచాయతీకి ప్రత్యేక రహదారి సౌకర్యం కల్పించాలని, ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లకుండా చర్యలు తీసుకోవాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్...
రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, నిధులు విడుదల చేయాలని, ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వామపక్షపార్టీలు, ప్రజా సంఘాల నాయకులు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని తలపెట్టాయి. విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద నిరసన తెలుపుతున్న వామపక్ష, ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు వందలాది మందిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి చుట్టుపక్కల పోలీస్‌స్టేషన్లలో నిర్బంధించారు.ఈసందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని మాట్లాడిన బిజెపి, టిడిపి నాయకులు అధికారంలోకి రావడంతోనే ఆ ఊసే ఎత్తకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ను అన్ని విధాలుగా ఆదుకుంటామని వాగ్దానం చేసి గద్దెనెక్కిన...
మార్క్సిస్టు సిద్ధాంతాన్ని ఆచరణాత్మకమైన శాస్త్రీయ సామ్యవాద సిద్ధాంతాన్ని అక్టోబరు విప్లవం నిరూపించిందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మంతెన సీతారాం అన్నారు. రష్యన్ విప్లవం శత వార్షిక ఉత్సవాలను పురష్కరించుకుని సిపిఎం ఏలూరు నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఉద్దరాజు రామం భవనంలో జరిగిన అక్టోబర్ విప్లవ శత వార్షిక సభ నగర కార్యదర్శి పి.కిషోర్ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్బంగా సీతారాం మట్లాడుతూ కార్మికవర్గం తొలి రాజ్యాధికారం అక్టోబర్ విప్లవం ద్వారా సాధ్యమైందన్నారు. అక్టోబర్ విప్లవ ఫలితంగా ఆవిర్భవించిన సోవియెట్ యూనియన్ హిట్లర్ ఫాసిజాన్ని మట్టికరిపించిదని, ఫాసిజానికి వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో సోవియెట్ యూనియన్ 4 కోట్ల మంది సైన్యం , పౌరులను త్యాగం...
కేరళ వామపక్ష ప్రజాతంత్ర ప్రభుత్వంపై బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నిరసిస్తూ సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. సిపిఎం కార్యాలయాలపై ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి గూండాల దాడులను సిపిఎం కార్యకర్తలు, నేతలు తీవ్రంగా ఖండించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే సిపిఎంపై దాడులకు పాల్పడుతున్నారని, 90 ఏళ్ల దేశ చరిత్రలో ఉన్నడూ లేని విధంగా ఒక రాజకీయపార్టీ కార్యాలయాల ముందు మరో రాజకీయ పార్టీ ఆందోళనలు నిర్వహించడం ఇదే తొలిసారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. విశాఖలోనూ ఇదే తరహాలో దాడులు చేశారని, ఇదే విధంగా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ నాయకత్వం వ్యవహరిస్తే తగిన బుద్ధి...
వంశధార నిర్వాసితులకు ప్యాకేజీ, ఇళ్ల స్థలాలు, 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని సిపిఎం పోరాడుతోంది. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకపోగా పోలీసు బందోబస్తు మధ్య రిజర్వాయర్ నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన చేయిస్తోంది. నిర్వాసితులకు పూర్తిస్థాయి పరిహరం చెల్లించి పునరావాసం కల్పించాకే వంశధార ప్రాజెక్టు పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ పనులు అడ్డుకోవడానికి వెళుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి భవిరి.కృష్ణమూర్తి మరియు నాయకులను హీరమండలం బ్యారేజి సెంటర్లో పోలీసులు అరెస్టు చేశారు
పాత్రికేయులు, హేతువాది గౌరీ లంకేష్ హత్యను ఖండిస్తూ వామపక్షాలు విశాఖలో నిరసన చేపట్టారు. మతతత్వ పాలకులు తమను వ్యతిరేకించే వారిని, ప్రశ్నించే వారిని భౌతికంగా నిర్మూలించే ఫాసిస్టు చర్యలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి పాలనలో మతతత్వ శక్తులు విజృంభించి కల్బుర్గి, ధబోల్కర్, పన్సారే వంటి హేతువాద, ప్రజాతంత్ర శక్తులను హత్యగావించిన తీరులోనే గౌరీ లంకేష్‌ను హత్య చేశారన్నారు.
ప్రభుత్వరంగ పరిశ్రమల పరిరక్షణ, విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ సాధనకు విశాఖ జిఎంవిసి గాంధీ విగ్రహం వద్ద 'సేవ్ పబ్లిక్ సెక్టార్-సేవ్ విశాఖ' పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు మాట్లాడుతూ విశాఖ నగరంలోని ప్రభుత్వరంగ సంస్థలను బిజెపి ప్రభుత్వం ప్రయివేటీకరణకు పూనుకుందని, రైల్వే జోన్ ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంతగనులు కేటాయించకుండా 10 నుంచి 20 శాతం షేర్లను విక్రయించడానికి కేంద్రం ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహించడానికి వెళ్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను విజయవాడ రైల్వే స్టేషన్ లో కలిసి సంఘీభావం తెలుపుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు,కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మరియు సిఐటియు నాయకులు..