భూములు, వృత్తుల పరిరక్షణ కోసం రైతులు, పేదలు, చేతివృత్తిదారులు ఏకోన్ముఖంగా కదలాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ నర్సింగరావు పిలుపునిచ్చారు. భూముల పరిరక్షణకు ఒకవైపు ప్రజాపోరాటాలు కొనసాగిస్తూనే మరోవైపు చట్టపరమైన పోరాటం కొనసాగించాల్సిన అవసరముందన్నారు. కమీషన్లకు కక్కుర్తిపడి ప్రభుత్వం దళారీపాత్ర పోషిస్తోందని విమర్శించారు. ఈ ప్రాంత రైతుల భూముల రిజస్ట్రేషన్లు జరిగేలా, భూముల మార్కెట్ విలువ పెంచేలా చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
పార్టీ కార్యక్రమాలు
దేశ ఆర్ధిక వ్యవస్ధకు ఎఫ్‌డీఐలు చిచ్చు పెడతాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు విమర్శించారు. విజయవాడలో సీపీఎం నేతలు, కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేశారు. మోదీ ప్రభుత్వం వంద శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతివ్వడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఎం కార్యాలయం నుంచి బీసెంట్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించి ఎఫ్‌డీఐ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనలో ధరలు భగ భగ మండిపోతున్నాయని వామపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే ప్రభుత్వ విధానాలు మార్చుకోవాలని హితవు పలికారు. పెరుగుతున్న నిత్యావసర ధరలకు నిరసనగా వామపక్షాలు విశాఖ జిల్లాలోని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా సీపీఎం నేత సీహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ 16 నెలల క్రితం ధరలు తగ్గిస్తామని అధికారంలోకి చంద్రబాబు వచ్చారని గుర్తు చేశారు. కానీ ధరలను విపరీతంగా పెంచేశారని, ఇందులో పోషకాహార సరుకులు కూడా ఉన్నాయన్నారు. పలు కంపెనీలు పప్పులు నిల్వ చేసుకుంటుంటే వాటిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు.
హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్వంలో నెల్లూరు డిఎంహెచ్‌ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.దోమల నుంచి రక్షించండి, హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి, డెంగ్యూ, విషజ్వరాలను ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ కార్యకర్తలు ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్ మాట్లాడుతూ జ్వరాలతో ప్రజలు అల్లాడుతుంటే పాలకులు, అధికారులు కబోది పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం అందడంలేదన్నారు.
విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు కేంద్ర పర్యావరణ, మంత్రిత్వశాఖ అనుమతులు ఇవ్వడం దారుణమని, దీనిని తక్షణమే రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ నర్సింగరావు డిమాండ్ చేశారు. మన్యంలో బాక్సైట్ తవ్వకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, బీజేపీ నాయకులు ప్రజలను మభ్య పెట్టారనే విషయం ఈ జీవోతో వెల్లడైందని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల ప్రకారం బాక్సైట్ తవ్వకాలకు మార్గం సుగమం అయిందని, ఈ జీవోలో 1212 హెక్టార్లలో బాక్సైట్ తవ్వకాలు చేపడితే దానికి రెట్టింపు హెక్టార్లలో మొక్కలు నాటాలని చెబుతున్నారని అన్నారు. టిడిపి, బిజెపి ప్రభుత్వాలు మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు ప్రైవేటు వ్యక్తులకు సర్వ హక్కులూ ఇస్తున్నాయని, బాక్సైట్ వల్ల ప్రభుత్వానికి...
బడా పారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్ల కోసమే ప్రభుత్వం భూ బ్యాంకు పేరిట భూములను బలవంతంగా సేకరిస్తోందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.వెంకటేశ్వర్లు అన్నారు. కడప జిల్లా బద్వేలు నియోజక వర్గంలో భూబ్యాంక్ కింద 36 వేల ఎకరాల ప్రభుత్వ, ప్రయివేటు భూముల్ని తీసుకున్న గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఒక్క కడప జిల్లాలోనే భూ బ్యాంకు కోసం 1.23 లక్షల ఎకరాలను ప్రభుత్వం సేకరించనుందన్నారు. ఈ విధానాన్ని రైతులు, ప్రజాస్వామికవాదులు, ప్రజలు వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. భవిష్యత్తులో బడా పారిశ్రామిక వేత్తలకు, కార్పొరేటర్లకు చౌకగా కట్టబెట్టేందుకే జిల్లాలో 33 మండలాల్లో పేదలు, రైతులకు చెందిన భూముల్ని సేకరిస్తోందని విమర్శించారు.
చంద్రబాబు ప్రభుత్వంపై విశాఖ జిల్లా సీపీఎం కార్యదర్శి లోకనాధం ఆగ్రహం వ్యక్తం చేసారు. భూసేకరణ పేరుతో భూమాఫియాను ప్రభుత్వం తయారు చేస్తుందని మండిపడ్డారు. 2005లో నావెల్ బెస్ స్పెషల్ ఆపరేషన్ పేరుతో 4,100 ఎకరాలు సేకరించి 10 ఏళ్లవుతున్నా నేటికి 5 లక్షల పరిహారం చెల్లించలేదని ధ్వజమెత్తారు. మత్స్యకారుల సంపదను దోపిడి చేస్తూ కోస్టల్ తీరాన్ని దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు.
నవ్యాంధ్రప్రదేశ్‌లోనూ ఉత్తరాంధ్ర పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తంచేశారు. ఉత్తరాంధ్రను సమగ్రంగా అభివృద్ధి చేయాలనే డిమాండ్‌తో సిపిఎం ఆధ్వర్యాన ఉత్తరాంధ్ర అభివృద్ధి సదస్సు రణస్థలంలోని దేవిశ్రీ కల్యాణ మండపంలో సోమవారం జరిగింది. ఇందులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉత్తరాంధ్రలోనే అత్యధిక వర్షపాతం, 16 జీవనదులు, మరెన్నో జీవగెడ్డలు ఉన్నాయని, అయినా, పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాంతం కరువుపీడిత ప్రాంతంగా ఉందని తెలిపారు. ఉత్తరాంధ్రలో జ్యూట్, ఫెర్రోఎల్లాయీస్ పరిశ్రమలు మూతపడి 30 వేల మందికి ఉపాధి పోయిందన్నారు. ఉత్తరాంధ్రలో విపరీతమైన కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను మాత్రమే...
గిరిజన రైతులు పండిస్తున్న పత్తి పంటకు క్వింటాకు రూ.6 వేల మద్దతు ధర కల్పించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డాక్టర్ మిడియం బాబూరావు డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఎటపాక పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశానికి నాయకుడు మర్లపాటి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. సమావేశంలో మిడియం బాబూరావు మాట్లాడుతూ పత్తి క్వింటాకు రూ.7,762 కనీస మద్దతు ధర ప్రకటించాలని కేంద్ర వ్యవసాయశాఖ నిపుణులు సిఫార్సు చేసినా కేంద్రం రూ.4,100 మాత్రమే ప్రకటించిందన్నారు. ప్రయివేటు వ్యాపారులు కుమ్మక్కై క్వింటాకు రూ.2,500 నుంచి రూ.3,500 మధ్య కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులు, పేదలు సాగు చేసుకుంటున్న భూములను గుంజుకొని కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రభుత్వ భూ బ్యాంకు విధానాన్ని ఉప సంహరించుకోవాలని భూ హక్కుల పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది.ఈసదస్సులో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని ధిక్కరించిందని విమర్శించారు. కర్నూలు జిల్లా శకునాల గ్రామంలో రైతులకు నష్ట పరిహారం చెల్లించకుండానే వారి భూములను లాక్కుందని విమర్శించారు. బందర్ పోర్టు భూ సేకరణకు ఎదురు తిరిగిన 29 మంది రైతులపై పోలీసులు నాన్‌బెయిల్ సెక్ష న్లతో కేసులు పెట్టారన్నారు. అవసరానికి మించిన భూములను జోలికెళ్లొద్దని, పారిశ్రామిక అభివృద్ధికి ఎంత భూమి కావాలో అంతా తీసుకోవాలని సూచించారు.
రాజధాని ప్రాంతానికి భూములిచ్చేందుకు సిద్ధంగా లేని రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవాలని ప్రయత్నిస్తే ప్రతిఘటిస్తామని ఏపి సీపీఎం రాష్ర్ట కార్యదర్శి మధు హెచ్చరించారు. అవసరమైతే వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని అన్నారు. కృష్ణానది ఒడ్డున నివసించే పేదల ఇళ్లను తొలగించాలని ప్రయత్నించినా ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. అసైన్డ్ భూముల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తెలపాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి ప్రత్యామ్నాయ వైద్య సదుపాయాలు అందించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ నరసింగరావు డిమాండు చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలో ఇటీవల డెంగీతో మృతి చెందిన జయశ్రీ,ఇషాంక్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులలో తమ బిడ్డలకు సరైన వైద్యం అందకపోవడం వల్లే మృతి చెందారని బాధిత తల్లిదండ్రులు తమ ఆవేదన వ్యక్తం చేశారు . చిత్తూరు జిల్లాలో మూడు నెలల వ్యవధిలో డెంగీతో 20 మంది మృతి చెందారని, ఇతర జ్వరాలతో లక్షా 44 కేసులు నమోదైనా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు.