1

ఉపోద్ఘాతం

 

1.1 భారత ప్రజల ప్రగతశీల, సామ్రాజ్యవాద వ్యతిరేక, విప్లవ సాంప్రదాయాలను వారసత్వంగా స్వీకరించింది కమ్యూనిస్టు పార్టీ. రష్యాలో అక్టోబర్‌ సోషలిష్ట్ విప్లవంతో ఉత్తేజితులైన దీక్షాయుత సామ్రాజ్యవాద వ్యతిరేక యోధుల చిన్న బృందంచే 1920 లో ఏర్పరచబడిన నాటి నుండి పార్టీ సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం మౌలికమైన సామాజిక పరివర్తన కోసం పోరాడటం తన లక్ష్యంగా నిర్దేశించుకొన్నది. వర్గ దోపిడి, సామాజిక అనిచివేత లేని సోషలిస్టు సమాజాన్ని భారతదేశంలో స్థాపించటానికి పార్టీ ప్రతిన బూనింది.
 

1.2 ప్రపంచమంతటా సామ్రాజ్యవాద వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన జాతీయ విమోచన ఉద్యమాలు, ప్రజాస్వామ్యం కోసం, సోషలిజం కోసం పోరటాలు ఇరవయ్యో శతాబ్దపు ప్రధాన లక్షణాలు, కార్మికవర్గ అంతర్జాతీయతకు అనుగుణంగా పార్టీ వాటిని సర్వదా బలపరిచింది. జాతీయ స్వాతంత్ర్యం సాధనకు, సోషలిజం లక్ష్యసాధనకు అంతిమ లక్ష్యమైన కమ్యూనిజం దిశగా పురోగమించటానికిగాను కార్యాచరణకు కరదీపికగా మార్క్సిజం ...

2

వర్తమాన ప్రపంచంలో సోషలిజం

 

2.1 ఇరవ్వయ్యో శతాబ్దంలో ప్రపంచంలో అనేక ముఖ్యమైన మార్పులు జరిగాయి. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట శతాబ్దం ఇది. 1917 లో అక్టోబర్‌ సోషలిస్టు విప్లవంతో మొదలుపెట్టి మహత్తర విప్లవ సంఘటనలనేకం ఈ శతాబ్దం చూసింది. రెండవ ప్రపంచ యుద్దంలో ఫాసిజం పై విజయం ప్రధానమైన ఒక ఘటన. సోవియట్ యూనియన్ అందులో నిర్ణయాత్మక పాత్ర వహించింది. చరిత్రాత్మకమైన చైనా విప్లవం, కొరియా, క్యూబా, వియత్నాంలలో విప్లవ శక్తుల విజయాలు, తూర్పు యూరప్ లో సోషలిస్టు రాజ్యాలు ఏర్పడటం, సామ్రాజ్యవాసానికి -సోషలిజానికీ మధ్య సాగిన మహాపోరాట పర్యవసానాలే. ఇది వలస దేశాలు రాజకీయ స్వాతంత్ర్యం పొందటానికి దారి తీసిన జాతీయ విమోచనోద్యమాల శతాబ్దం కూడా. మార్క్సిజం లెనినిజం సిద్దాంతం అంచనా వేసినట్ట్లుగానే ఈ విజయాలు...

                                                                                    3

స్వాతంత్ర్యం ఆ తర్వాత

 

3.1 భారత ప్రజలలో విస్తార జన సామాన్యం స్వాతంత్ర్య పోరాటంలో ఉత్సాహాంగా పాల్గోని దాన్ని విజయవంతం చేశారు.వారు దేశభక్తి ప్రేరితులైనవారు. స్వతంత్ర భారతావనినీ, ప్రజలకు నవజీవానాన్నీ కాంక్షించారు. పేదరికం, దోపిడీతో కూడిన దుర్భర పరిస్ధితులు తోలగిపోతాయని వారు ఆశించారు. వారు దృష్టిలో స్వాతంత్ర్యం అంటే భూమి, తిండిన్యాయమైన వేతనాలు, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఉపాధి లభించడమే. స్వాతంత్ర్యం అంటే కులతత్వం , మతవిద్వేషంవంటి సమాజిక రుగ్మతల నుంచి విమోచన, ప్రజాతంత్ర పద్దతిలో ప్రజల సాంస్కృతిక అవసరాలు నెరవేరటమే...

4

విదేశాంగ విధానం

 

4.1 ఏ రాజ్యం, దాని ప్రభుత్వం యొక్క విదేశాంగ విధానమైనా, అంతమ విశ్లేషణకు దాని అంతరింగిక విధానపు వ్యక్తికరణగానే వుంటుంది. ఆ ప్రభుత్వానికి. ఆ రాజ్యానికి అధిపత్యం వహించుతున్న వర్గం లేదా వర్గాల ప్రయోజనాలనే అది ప్రధానంగా ప్రతిబింబిస్తూ వుంటుంది. భారత ప్రభుత్వ విదేశాంగ విధానం సహజంగానే మన బూర్జువా వర్గ ద్వంద్వ స్వభావాన్నే అంటే సామ్రాజ్యవాదం పట్ల వ్యతిరకతతో పాటు, దానితో రాజీ పడే , మిలాఖత్తయ్యే ద్వంద్వ స్వభావాన్నే ప్రతిబింబిస్తూ వుంటుంది. గత ఐదు దశాబ్దాక విదేశాంగ విధాన పరిణామ క్రమాన్ని పరిసీలించి చూస్తే ఈ ద్వంద్వ స్వభావం కనిపించుతుంది. యాభయ్యె దశకం మధ్యబాగం వరకూగల తోల దశలో భారత ప్రభుత్వం బ్రిటిన్ తదితర రాజ్యాలను సంతృప్తి పరిచే పరికి విధానాన్ని అనుసరించింది. అయితే యాభయ్యవ దశకం మధ్య నుండి కొత్త వరవడి మొదలైంది. సామ్రాజ్యవాద, సొషలిస్టు శిబిరాల మధ్య నిశితంగా చీలి వున్న ప్రపంచంలో ,సామ్రాజ్యవాద కూటమితో నిమిత్తం లేకుండా సాగిపోయే అవకాశాలు ఏర్పడినాయి. సైనిక కూటములకూ వ్యతిరేకంగా...

5

    రాజ్యాంగ యంత్రం - ప్రజాస్వామ్యం

    5.1 ప్రస్తంత రాజ్యంగ యంత్రం బడా బూర్జువా నాయకత్వనగల బూర్జువా భూస్వామ్య వర్గాల పరిపాలన సాధనం, ఈ బడా బూర్జువా వర్గం పెట్టుబడిదారీ అభివృద్ది మార్గాన్ని అనుసరించే లక్షంతో విదేశీ పైనాన్స్ పెట్టుబడి అంతకంతకు మిలాఖత్ అవుతున్నది.ఈ వర్గ స్వభావమే మన దేశ జీవితంలో రాజ్యంగ యంత్రం యొక్క పాత్రనూ, విధులనూ ప్రధానంగా నిర్ణయిస్తుంది.

     

    5.2  రాజ్యాంగ వ్యవస్ధ పెరుకు ఫెడరల్ అయినప్పటి అత్యధిక అధికరాలు, వనరులు కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే కేంద్రీకృతమై వున్నాయి. ఉమ్మడి భాష ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పరచాలనే డిమాండ్‌ను బడా బూర్జువా వర్గం మొదట్లో ప్రతిఘటించినా ప్రజా ఉద్యమాలు, అందోళనల బత్తిడితో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు అంగీకరించక తప్పలేదు. బిజెపి నాయకత్వంలోని ప్రభుత్వం భాషా రాష్ట్రాల సూత్రంపై మరోసారి దాడి చేస్తొంది.పాలన సౌలభ్యం పేరుతో చిన్న రాష్ట్రాల ఏర్పాటును ప్రతిపాదిస్తొంది...

                                                                                              6

                                                             జనతా ప్రజాస్వామ్యం - దాని కార్యక్రమం.

    6.1 ప్రస్తుత బూర్జువా భూస్వామ్య పాలనలో ప్రజలకు వెనుకబాటుతనం, దారిద్ర్యం ఆకలి, నిరుద్యోగం, దోపిడి నుంచి విముక్తి లభించే ఆశ లేదని అనుభవం చెబుతున్నది. స్వాతంత్ర్యం వచ్చినపట్టి నుంచి బడా బూర్జువా వర్గం ఏకదాటిగా రాజ్యాధికారంలో కొనసాగుతున్నది. ఒక మైపున జనబాహుళ్యాన్ని పణంగా పెట్టి మరోవైపున సామ్రాజ్యవాదం, బడా భూస్వామ్య వర్గాలతో రాజీలు, బేరసారాలు నడిపి తన వర్గ స్ధాన్నాని పటిష్టం చేసుకోవడానికి అది ఈ ఆధికారాన్ని ఉపయోగిస్తున్నది. అభివృద్ది చెందిన పెట్టుబడిదారీ దేశాలలో పెట్టుబడిదారీ విధానం పెరిగిన పరిస్ధితివలెగాక భారతదేశంలో పెట్టుబడిదారీ పూర్వ సమాజం పై పెట్టుబడిదారీ సమాజం రుద్దబడింది. ...

    7

    జనతా ప్రజాస్వామిక సంఘటన నిర్మాణం

     

    7.1 భారత విప్లవ మౌలిక కర్తవ్యాలను సంపూర్ణంగా, సమగ్రంగా అమలు జరిపేందకుగాను.ప్రస్తుత దశలో బడా బూర్జువా వర్గ నాయకత్వంలో ఇప్పుడున్న బూర్జువా భూస్వామ్య రాజ్యం స్ధానే కార్మిక వర్గ నాయకత్వంలోని జనతా ప్రజస్వామిక రాజ్యాన్ని స్ధాపించడం తప్పనిసరి అవసరం.

     

    7.2 ప్రస్తుత దశలో మన విప్లవం ప్రధానంగా ఫ్యూడల్ వ్యతిరేక , సామ్రాజ్యవాద వ్యతిరేక, గుత్త వ్యతిరేక ప్రజాతంత్ర స్వభావం కలిగి వుంటుంది. మన విప్లవ దశ, దాన్ని సాధించడంలో వివిధ వర్గాలు నిర్వహించే పాత్రను కూడా నిర్దేశిస్తుంది. ప్రస్తుత యుగంలో సోషలిజం సాధన దిశగా ముందుకు సాగేందుకుగాను కార్మిక వర్గం తప్పనిసరిగా ప్రజాతంత్ర విప్లవానికి నాయకత్వం వహించవలసి వుంటుంది. ఇది కార్మికవర్గం నిర్మించి, నడిపించే నూతన తరహ జనతా ప్రజాస్వామిక విప్లవమేగాని పాత తరహ బూర్జువా ప్రజాతంత్ర విప్లవం కాదు.

    ...

    8

    కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం 

     

    8.1 జనతా ప్రజస్వామికాన్ని స్ధాపించేందకై భారత కమ్యూనిస్టు పార్టీ ( మార్క్సిస్టు ) తన విప్లవకర కార్యక్రమన్ని భారత ప్రజానీకం ముందు ఉంచుతున్నది. జనతా ప్రజాస్వామిక విప్లవం సోషలిజానీకం, దోపిడీరహిత సమాజానికి పురొగమించే బాట వేస్తుంది. భారత ప్రజలను విముక్తి చేసే అలాంటి విప్లవానికి, రైతాంగంతో కలసి కార్మికవర్గం నాయకత్వం వహించాల్సి వుంటుంది. కార్మికవర్గం అగ్రగామి దళమైన కమ్యూనిస్టు పార్టీ ఈ లక్ష్యసాధన కోసం సామ్రాజ్య వాదనికి, గుత్త పెట్టుబడిదారీ విధానానికి, భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు నిర్వహించేల్సి వుంటుంది. మార్క్సిజం లెనినిజం సూత్రాలను మన దేశంలో వున్న పరిస్ధితులకు నిర్ధిష్టంగా అనుయించడం ద్వారా పార్టీ విజయం సాధించే వరకు రాజకీయ , సైద్దాంతిక , ఆర్ధిక , సామాజిక, సంస్కృతిక రంగాలన్నిటా దీర్ఘకాలిక పోరాటాలు...