
ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్‌్ సిల్వర్‌జూబ్లీ ఉత్సవాల సందర్భంగా నాలుగు రోజుల పాటు జరిగే 8వ మహాసభ గురువారం హైదరాబాద్‌లోని ఆర్టీసి కళాభవన్ (కామ్రేడ్ దీపామాలిక్ మంచ్, కామ్రేడ్ ఆర్తీదాస్ గుప్తా హాల్)లో ఉత్సాహంగా ప్రారంభమైంది.ఆరోగ్యవంతమైన భావి భారతావనికి కృషి చేస్తున్న అంగన్‌వాడీలు తమను వలంటీర్లుగా కాకుండా వర్కర్లుగా గుర్తించాలని రోడ్డున పడి పోరాటం చేయాల్సి రావడం దురదృష్టకరమని సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ అన్నారు. ఇలాంటి కీలకమైన భాద్యత నిర్వర్తిన్తున్న అంగన్‌వాడీల సమస్యలపై పాలకులు సానుకూలంగా స్పందించకపోవడం సరికాదని చెప్పారు. గర్భిణీలు, శిశువులు, బాలల కోసం పాటుపడుతున్న ఐసీడీఎస్‌ను పాలకులు లాభాపేక్ష దృష్టితో చూస్తున్నారని ఆరోపించారు. వారు చేస్తున్న పనికి గుర్తింపు వస్తున్నా.. వర్కర్లుగా గుర్తించడం లేదన్నారు. అంగన్‌వాడీలకు కనీస వేతనం ఇవ్వడంతో పాటు వారిని వర్కర్లుగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు.