అఖ్లాక్‌ హంతకులను శిక్షించండి

దాద్రీ సమీపంలోని బిసారా గ్రామంలో నిరుడు సెప్టెంబర్‌లో జరిగిన అఖ్లాక్‌ హత్యోదంతంపై మతతత్వ శక్తులు కుట్రలకు పాల్పడుతున్నాయని సీపీఐ(ఎం) విమర్శించింది. అఖ్లాక్‌ ఇంట్లో కాకుండా వేరే చోటి నుంచి సేకరించిన మాంసం నమూనా గోమాంసమేనని మథురలోని ఒక ప్రయోగశాల విడుదల చేసిందని చెబుతున్న నివేదిక ఆధారంగా ఈ కేసును ఉద్దేశపూరితంగా గోహత్య, బీఫ్‌ తినడం వైపు మళ్లిస్తున్నారని పార్టీ పొలిట్‌బ్యూరో ఒక ప్రకటనలో తెలిపింది.