
ప్రజాశ్రేయస్సు దృష్ట్యా చేపడుతున్న అభివృద్ధి పనులపై అలసత్వం వహించవద్దని కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం అధికారులను ఆదేశించారు. గురువారం టెక్కలి మండలంలోని శ్యామసుందరాపురంలో అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. రూ.20 లక్షలతో నిర్మిస్తున్న రోడ్లు, కాలువ పనులను ఆయన పరిశీలించారు. ఎన్టీఆర్ నగర్‌కు చెందిన మహిళ కలెక్టర్‌తో మాట్లాడుతూ ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సక్రమంగా సరుకులు పంపిణీ కావడం లేదని ఫిర్యాదుచేశారు. కలెక్టర్ స్పందిస్తూ జన్మభూమి కమిటీలకు అప్పగించామని, వారినే అడగాలని సమాధానమిచ్చారు. కార్యక్రమంలో ఎంపిడిఒ వై రవీంద్రకుమార్, ఎంపిపి మట్ట సుందరమ్మ, సర్పంచ్ బెహరా కృష్ణవేణి పాల్గొన్నారు.