
నరేంద్రమోదీతో ఈనెల 17వ తేదీన సమావేశం కాబోతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి విభజన చట్టంలో పొందుపరిచిన నిబంధనలన్నీ అమలు చేయాలని కోరబోతున్నారు. అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ ప్రకటించినట్టుగా రాష్ట్రానికి ప్రత్యేకహోదా, ఏడు వెనుకబడిన జిల్లాలకు రూ.24,350 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని విజ్ఞప్తి చేయనున్నారు. రెవిన్యూలోటు భర్తీ, పోలవరం, రాజధాని నిర్మాణానికి నిధుల అంశాన్ని కూడా ప్రధానమంత్రి ముందుంచబోతున్నారు.