
పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరం, ఆఫ్ఘనిస్థాన్‌లో భారత దౌత్య కార్యాలయంపై ముష్కరుల దాడిపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈరోజు సమీక్ష నిర్వహించారు. మోడీ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి జయశంకర్ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.