
విజయవాడలోని ఎపి ప్రభుత్వ ప్రాంతీయ ముద్రణాలయంలో శుక్రవారం జరిగిన గుర్తింపు సంఘ ఎన్నికల్లో ఎపి గవర్నమెంట్ ప్రెస్ వర్కర్స్ యూనియన్(సిఐటియు అనుబంధం) ఘన విజయం సాధించింది. మొత్తం 82 ఓట్లకుగాను 81 ఓట్లు పోలయ్యాయి. వీటిలో సిఐటియు అనుబంధ యూనియన్‌కు 47, ఐఎన్‌టియుసికి 20, ఎఐటియుసికి 14 ఓట్లు వచ్చాయి. దీంతో 27 ఓట్ల మెజార్టీతో సిఐటియు విజయం సాధించింది.