
ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న 4,534 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడుకు శుక్రవారం లేఖ రాశారు. జిఒ 142, 143ల ద్వారా 2000 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేశారని పేర్కొన్నారు. కాంట్రాక్టు లెక్చరర్స్ నియామకంతో ప్రభుత్వ కళాశాలలు మెరుగైన ఫలితాలు సాధించాయని తెలిపారు