
తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆదివారం చేపట్టిన కాపు ఐక్య గర్జన సభ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బిసిలుగా గుర్తించే వరకూ చావోరేవో తేల్చుకుందామంటూ ముద్రగడ పిలుపునిచ్చారు. పావుగంట కూడా ప్రసంగించకుండానే ఆయన అనూహ్యంగా రైలు, రాస్తారోకోలకు పిలుపునిచ్చారు. దీంతో లక్షలాదిగా వచ్చిన ఆందోళనకారులు కొంతమంది రైలు పట్టాలపై బైఠాయించారు. మరికొందరు ముద్రగడతో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. మరింత రెచ్చిపోయిన ఆందోళనకారులు రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లో14 రైలు బోగీలకు నిప్పంటించారు. 8 పోలీసు జీపులను తగులబెట్టారు. తుని రూరల్ పోలీస్‌స్టేషన్‌కు నిప్పంటించారు. ఆందోళనకారుల రాళ్లదాడిలో ఒక కానిస్టేబుల్ మృతి చెందాడు.