
గురువారం స్టాక్ మార్కెట్లు భారీ కుదుపునకు గురవడంతో చిన్న మదుపరులు దాదాపు గల్లంతయ్యారు. అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలు, చమురు ధర పుష్కర కాల కనిష్ఠానికి పడిపోవడం, అమెరికా ఫెడ్ 'అనుమానపు' వ్యాఖ్యలు ఆసియా మార్కెట్లు కుంగడం, దేశీయంగా వృద్ధిపై నెలకొంటున్న కారు మేఘాలు, పెరుగుతున్న బ్యాంకుల నిరర్థక ఆస్తులు, అంతకంతకు పడిపోతున్న రూపాయి విలువ, తగ్గుతున్న వినియోగ వస్తువుల ధరలు వంటి దేశీయ కారణాలతో మార్కెట్లు గురువారం కుదేలయ్యాయి.గురువారం ఒక్క సెషన్‌లో ఏకంగా రూ.3,18,245 లక్షల కోట్లకు పైగా సంపదను కోల్పోయినట్టయింది.