
కేజ్రీవాల్, నితీష్ కుమార్ లాంటి నకిలీ ముస్లింల వల్లే దేశానికి ముప్పు అని బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ అన్నారు. దేశంలో అసహనం పెరుగుతోందంటూ రాద్దాంతం చేసిన కేజ్రీవాల్, నితీష్‌లు బీహార్ ఎన్నికల తరువాత ఆ ఊసే ఎత్తడంలేదని మండిపడ్డారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారన్న ఆయన, అందులో వివాదం ఏముందని ప్రశ్నించారు.