
దేశీయంగా రోజురోజుకూ ప్రాబల్యం పెంచుకుంటున్న ఉబర్, ఓలా కార్పొరేట్ ఆన్‌లైన్ టాక్సీ సర్వీసులకు ప్రత్యామ్నాయంగా కేరళలో దేశీ కాల్ టాక్సీ, కాల్ ఆటో రిక్షా సర్వీసులను తీసుకొచ్చేందుకు కేరళలో సిపిఐ(ఎం) కృషిచేస్తోంది. కార్పొరేట్ రంగంలోని ఆన్‌లైన్ టాక్సీ సర్వీసులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సిపిఎం , ఈ విదేశీ కార్పొరేట్ సంస్థలకు ప్రత్యామ్నాయంగా అత్యంత నమ్మకమైన, నిపుణులైన వారితో దేశీ టాక్సీ సేవలను ముందుకుతెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. సంప్రదాయ క్యాబ్ సర్వీసులపై ఆధారపడి జీవిస్తున్న వారి పొట్టకొడుతున్న కార్పొరేట్ ఆన్‌లైన్ టాక్సీ, ఆటో సర్వీస్‌లను కేరళలో ప్రవేశించనీయబోమని సిపిఎం నేత ఒకరు చెప్పారు.