
కేరళలో చోటు చేసుకున్న కోట్లాది రూపాయల సౌర కుంభకోణంలో అనేక వాస్తవాలు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఈ కుంభకోణంలో నిందితురాలయిన టీమ్ సోలార్ సంస్థ యజమాని సరితా ఎస్ నాయర్‌తో ముఖ్య మంత్రి ఊమెన్ చాందీ వివాహేతర సంబంధాలను కొనసా గించారని, అంతేకాక ఈ కుంభకోణంలో తాను ముఖ్య మం త్రికి రు.5.5 కోట్ల ముడుపులు అందచేశానని ప్రధాన నింది తుడైన బిజు బాలకృష్ణన్ అలియాస్ ఆర్‌కె నాయర్ జుడిష ియల్ కమిషన్‌కు తెలిపారు. సంచలనాత్మకమైన ఈ విషయా లకు సంబంధించిన ఆధారాలు పొందుపర్చిన సిడిని ఆయన బుధవారం కమిషన్‌కు అందచేశారు.