కోల్‌కతాలో లెఫ్ట్ భారీ ర్యాలీ..

సామ్రాజ్యవాదాన్నీ, మతతత్వాన్నీ అంతమొందిస్తామని నినదిస్తూ కోల్‌కతా వీధుల్లో వేలాది మంది కదం తొక్కారు. దాద్రీ సంఘటన, పాలస్తీనా అంశంపై మారిన భారత విదేశాంగ వైఖరి నేపథ్యంలో 6 వామపక్ష పార్టీలు శుక్రవారం ర్యాలీ నిర్వహించాయి. ఎర్రజెండాలు, ప్లకార్డులతో ర్యాలీలో పాల్గొన్న జనసందోహంతో కోల్‌కతా ఎర్రబారింది. నగరం మధ్యలో ఉన్న ఎస్‌ప్లనేడ్‌లోని వై చానల్‌ వద్ద ప్రారంభమైన ర్యాలీ ఉత్తర కోల్‌కతాలోని కాలేజ్‌ స్క్వేర్‌ దాకా కొనసాగింది. ఈ ర్యాలీలో ముందు నిలబడ్డవారిలో పశ్చిమ బెంగాల్‌ లెఫ్ట్‌ ఫ్రంట్‌ చైర్మన్‌ బిమన్‌ బసు, సౌమెన్‌ బసు (ఎస్‌యుసిఐ), పార్థో ఘోష్‌ (సిపిఐ-ఎంఎల్‌) తదితరులున్నారు. పాలస్తీనా విషయంలో భారత్‌ తన వైఖరిని మార్చుకోవడం దేశానికే సిగ్గుచేటని బిమన్‌ బసు అన్నారు.