
తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర తొలి మహాసభలు ఉట్నూర్‌లోని హెచ్‌కేఎన్ గార్డెన్‌లో సోమవారం ముగిశాయి. చివరి రోజున తెలగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రతినిధుల మహాసభల సందర్భంగా రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. 25 మందికి కమిటీలో స్థానం కల్పించారు. అధ్యక్షులుగా మరోసారి సున్నం రాజయ్య ఎన్నికకాగా, ప్రధాన కార్యదర్శిగా తొడసం భీంరావును ఎన్నుకున్నారు.