
ఆంగన్‌వాడీ కార్యకర్తలను దూషించిన ప్రభుత్వ చీఫ్‌విప్ చింతమనేని ప్రభాకర్‌ను పదవి నుంచి భర్తరఫ్ చేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. గురువారం కడప పాతబస్టాండ్‌లోని సిఐటియు కార్యాలయంలో సిఐటియు జిల్లా కోశాధికారి శ్రీనివాసులరెడ్డి అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రామిక మహిళ జిల్లా కార్యదర్శి ఐ.ఎన్.సుబ్బమ్మ మాట్లాడుతూ ఏలూరులో చింతమనేనికి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన అంగన్‌వాడీల పట్ల ఆయన దురుసుగా ప్రవర్తించడం దారుణమన్నారు. గతంలో తహశీల్దార్ వనజాక్షి పట్లా ఇలాగే ప్రవర్తించారని గుర్తుచేశారు.