తమిళనాడు ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమె మరో పర్యాయం సీఎంగా బాధ్యతలు చేపట్టారు. మద్రాస్ యూనివర్శిటీ సెంటినరీ సమావేశ మందిరంలో రాష్ట్ర గవర్నర్ రోశయ్య జయలలితతో ప్రమాణస్వీకారం చేయించారు.