
టెలికం కంపెనీలు అదనపు వ్యయ భారం లేకుండా ఇచ్చి పుచ్చుకునే విధానంలో కవరేజీ సేవలు మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగా నెట్‌వర్క్ షేరింగ్ కోసం చేతులు కలుపుతున్నాయి. వొడాఫోన్, ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌తో టై అప్ అయిన మరుసటి రోజే రిలయన్స్ జియో సైతం బీఎస్‌ఎన్‌ఎల్‌తో నెట్‌వర్క్ షేరింగ్ ఒప్పందం చేసుకుంది.