
దేశవ్యాప్తంగా సబ్‌ప్లాన్ నిధులు దారిమళ్లుతున్నాయని, దళితుల సంక్షేమానికి ఖర్చు చేసేది కేవలం 0.2 శాతం నిధులేనని ఎస్‌సి జాతీయ కమిషన్ సభ్యురాలు పిఎం.కమలమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాల్లోనూ సబ్‌ప్లాన్ నిధులు ఎంత కేటాయించారు?, ఎంత ఖర్చు చేశారు?, ఎంత మిగిలిందనే లెక్కలు ఉండటం లేదన్నారు. ఈ విషయంపై రాష్ట్రపతికి నివేదిక అందజేసి, నిధులు సక్రమంగా వినియోగించేలా కమిషన్ తరుపున సూచిస్తామన్నారు.