సూరత్‌లోని స్వామినారాయణ భగవానుడి విగ్రహం తెల్ల చొక్కా, ఖాకీ నిక్కర్‌తో దర్శనమివ్వడంతో భక్తులు తెల్లబోతున్నారు! విగ్రహాన్ని బీజేపీ మాతృసంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలను పోలిన దుస్తులతో, నల్ల టోపీ, నల్ల బూట్లతో అలంకరించడంపై దుమారం మొదలైంది. సోషల్ మీడియాలో ఈ విగ్రహం ఫొటోలు హల్‌చల్ చేస్తున్నాయి.