
ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓటుకు నోటు కేసు పిటిషన్‌ను శుక్రవారం అత్యున్నత న్యాయస్థానం విచారించింది. ఏపి సిఎం చంద్రబాబునాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ ఎస్‌ఎ బాబ్డే, జస్టిస్ అశోక్ భూషన్‌ల తో కూడిన సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది.