
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రభుత్వం ఇవాళ 5బిల్లులు ప్రవేశపెట్టింది. మౌలిక సదుపాయల అభివృద్ధి సవరణ బిల్లు, విద్యుత్ సుంకం బిల్లు, నౌకాశ్రయాల అభివృద్ధిపై మ్యారీటైమ్ బోర్డు బిల్లు, విలువ ఆధారిత పన్ను, విదేశీ మద్యం సవరణ బిల్లులను ప్రభుత్వం స్పీకర్ అనుమతితో సభలో ప్రవేశ పెట్టింది. వైకాపా సభ్యుల నినాదాల మధ్యే మంత్రులు ఆయా బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సభను 15 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.