
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి నిర్మాణా నికి అవ సరమైన పర్యావరణ ఆమోదాన్ని సక్రమ మైన పద్ధతిలో పొందలేదని పర్యావరణ నిపుణులు, ప్రజా సంఘాలువి మర్శిస్తున్నాయి. స్టేట్ ఎన్విరాన్ మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ(ఎస్‌ఇఐఎఎ)కి రాజధాని పర్యావరణ ప్రభావ అధ్యయనాన్ని నిబంధనలు రూపొందించకుండా క్రిడా పర్యావరణ ఆమోదాన్ని ఎలా పొందిందని నిపు ణులు విమర్శిస్తున్నారు. కన్సల్టెంట్‌ను నియమించ కుండా, క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించకు ండా పర్యావరణ క్లియరెెన్స్ ఎలా లభిస్తుందనే ప్రశ్న లేవనెత్తుతున్నారు. ప్రభుత్వ ఒత్తిడిపై రెగ్యులేటరీ ఏజెన్సీ కాగితంపై రబ్బర్ స్టాంప్ వేసి ఇచ్చిందని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. పర్యావరణ ప్రభా వ నివేదికను కన్సల్టెంట్ ద్వారా తయారుచేయించి దానిపై బహిరంగ విచారణ జరిపించాలన్న విషయా న్ని సిఆర్‌డిఎ కానీ ప్రభుత్వం కాని పట్టించుకోలేదు. రాజధాని ప్రాంతంలో జల వనరుల వివ రాలు నమోదు చేయలేదు. పర్యావరణ సంబంధిత సామా జిక, ఆర్థిక సమాచా రాన్ని సేకరించలేదు. రాజధాని ప్రాం తం మాగాణి భూమి అని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎదుట అంగీకరించింది. వెట్ ల్యాండ్ నిబంధనల ప్రకారం వీటిలో నిర్మాణాలు చేపట్టకూడదు. ఒకవేళ చేపట్టదలిస్తే నేష నల్ వెట్ ల్యాండ్ రెగ్యులేటరీ అథారిటీకి అనుమతి కోసం దర ఖాస్తు చేసుకోవాలి. సిఆర్‌డిఎ ఆ ప్రయ త్నమే చేయలేదు. సిఆర్‌డిఎ అనేక కోర్టు తీర్పులను కూడా ఉల్లంఘించిందని న్యాయనిపుణులు అభిప్రా యపడుతున్నారు.