
డీఎండీకే చేరికతో బలపడిన ప్రజాసంక్షేమ కూటమిలో ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) కూడా చేరే సూచనలు కన్పిస్తున్నాయి. పొత్తు విషయమై కూటమి సమన్వయకర్త, ఎండీఎంకే నేత వైగో మరో రెండ్రోజుల్లో ఆప్ నేతలతో సమావేశం కానున్నారు. ఈ చర్చల్లో భాగంగానే ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూటమి సీఎం అభ్యర్ధి కెప్టెన్ విజయకాంత్‌ను కలుసుకుం టారని పార్టీ వర్గాలు తెలిపాయి.