
ఈ ఏడాదికి గానూ ఉత్తమ జర్నలిస్టులకిచ్చే ప్రతిష్టాత్మక రామ్‌నాథ్ గోయంకా అవార్డును ప్రధాన మంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగా తీసుకునేందుకు టైమ్స్ ఆఫ్ ఇండియా జర్నలిస్టు అక్షయ ముకుల్ తిరస్కరించారు. ముకుల్‌కు నాన్ ఫిక్షన్ బుక్స్ విభాగంలో రామనాథ్ గోయంకా అవార్డు లభిం చింది. హిందూత్వ సైద్ధాంతిక పునా దులపై ఈ పుస్తకం వెలువడింది. అయి తే అవే సిద్ధాంతాలతో ప్రధాని రాజకీ యాలు సాగుతున్న క్రమంలో ము కుల్ అవార్డుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని కారవాన్ వెబ్‌సైట్‌తో జర్నలిస్టు సందీప్ భూషణ్ చెప్పారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కడం విశిష్ట గౌరవమేనని ముకుల్ తనతో చెప్పారని, అయితే ప్రధాని మోడీ నుంచి అవార్డు స్వీకరించాల్సి రావడమే అతని సమస్యని సందీప్ భూషణ్ పేర్కొన్నారు.