
ప్రైవేటు యూనివర్సిటీలు ( ఎస్టాబ్లిష్‌మెంట్ రెగ్యులేషన్ ) బిల్లు - 2015ను గెజిట్‌లో ప్రచురణ నిమిత్తం ప్రభుత్వం జీవో నెం.3 ను సోమవారం విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 22న శాసన సభలో ప్రైవేటు యూనివర్సిటీ బిల్లు - 2015 ప్రవేశపెట్టింది. గ్రీన్‌ఫీల్డ్ ప్రైవేటు యూనివర్సిటీల ద్వారా ప్రపంచ స్థాయి విద్యా విధానం అందించే ఉద్దేశంతో తీసుకువచ్చిన ఈ బిల్లుకు గవర్నర్ ఈఎల్ నరసింహన్ ఈ నెల 8న ఆమోదం తెలిపారు. దీంతో బిల్లును గెజిట్‌లో ప్రచురించేందుకు గాను న్యాయశాఖ సోమవారం జీవో నెం.3ను విడుదల చేసింది.