బడ్జెట్ లో ఏపికి మొండిచేయి

కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్‌ ప్రభు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌ రాష్ట్రానికి మొండిచెయ్యి చూపించిందని సిపిఎం తెలిపింది. కొత్త రైల్వే లైన్లు, కొత్త రైళ్లు ఒక్కటి కూడా రైల్వే బడ్జెట్‌లో ప్రతి పాదించకుండా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేయ డాన్ని ఆ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న రైల్వే జోన్‌ ఏర్పాటు గురించి మాటమాత్రమైనా ప్రస్తావించక పోవడం రాష్ట్ర ప్రజలను మోసగించడమేనని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి మధు  విమ ర్శించారు. రైల్వే బడ్జెట్‌లో రూ.50 వేల కోట్లను లోటును చూపించినా దాన్ని భర్తీ చేయ డానికి నిర్దిష్టమైన చర్యలు సూచించలేదని, పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్యం (పిపిపి) విధానాన్ని ప్రతి పాదించడం దారుణమని పేర్కొన్నారు.