
సిపిఐ రాష్ట్ర సమితి బర్ధన్ సంస్మరణ సభ ను విజయవాడలోని దాసరి నాగభూషణరావు భవన్‌లో గురువారం నిర్వహించింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లా డుతూ బర్ధన్ కార్మికులు, కష్టజీవుల పక్షపాతని పేర్కొంటూ నివాళులర్పించారు. నమ్మిన సిద్ధాం తాల కోసం అలుపెరగని పోరాటం చేశారన్నారు. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 1991నాటి నూతన ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణ విధానాలకు తిలోదకాలు పలకాలని చెప్పిన వారిలో బర్థన్ ఒకరని తెలిపారు.