
చంద్రబాబు ఎస్సీల పరంగా చేసిన వ్యాఖ్యలను కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి తప్పుబట్టింది. దళితుల మనోభావాలు దెబ్బతినేలా చంద్రబాబు మాట్లాడారని కెవిపిఎస్ విజయవాడ నగర కార్యదర్శి నటరాజ్ విమర్శించారు. విజయవాడలోని మాచవరం సెంటర్‌లో కెవిపిఎస్ కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ దళితుడని ఇంకా ఎందరో మేథావులు దళితుల్లో ఉన్నారని అటువంటి దళిత సామాజిక వర్గాన్ని కించపరచడం సరికాదని అన్నారు.