భద్రత పేరిట కుట్ర: CPM

భద్రత పేరిట కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ వివిధ రాష్ట్రాలను సందర్శిస్తున్నారు. అందులో భాగంగా విశాఖపట్టణంలో రాజ్ నాథ్ సింగ్ సమావేశాలు నిర్వహించారు. ఈ పర్యటన వెనుక పెద్ద కుట్ర ఉందని సీపీఎం నేత నర్సింగరావు పేర్కొన్నారు.విశాఖపట్టణం పర్యటన వెనుక పెద్ద కుట్ర ఉందని, ఏజెన్సీలోని బాక్సైట్ ను దక్కించుకొనే కుట్ర జరుగుతోందన్నారు. ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను గిరిజనులు, సంఘాలు వ్యతిరేకిస్తున్నారని గుర్తు చేశారు. దీనితో ఈ ప్రాంతంలో పారామిలటరీ సైన్యాన్ని దింపడానికి వ్యూహరచన చేశారని విమర్శించారు. ఛత్తీస్ గఢ్ ప్రాంతంలో అలాంటి పరిస్థితి జరిగిందని, ప్రస్తుతం మైనింగ్ మొత్తం మాఫియా హస్తాల్లోకి వెళ్లిపోయిందన్నారు.