
దేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యా రంగంపై పెద్ద ఎత్తున దాడి జరుగు తోందని, దాని కను గుణంగానే విధానాల రూప కల్పన జరుగు తోందని ఎస్‌ఎఫ్‌ఐ 15వ జాతీయ మహాసభ పేర్కొంది. దేశవ్యాప్తంగా విద్య కాషాయీకరణకు వ్యతిరేకంగా పెద్దఎత్తున పోరాడాలని మహాసభ నిర్ణయించింది. సోమవారం రాజస్థాన్‌లోని సీకర్ (సుదీప్తో గుప్తా నగర్)లో ఎస్‌ఎఫ్‌ఐ 15వ అఖిల భారత మహాసభలు ఘనంగా ముగిసాయి.