
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయు)లో వివక్షపై పోరు రోజురోజుకు ఉధృతమవుతోంది.హెచ్‌సీయు వెలివాడలో నిర్వహించిన సభలో వివిధ ప్రజా, దళిత, విద్యార్థి, కార్మిక సంఘాల నాయకులు పాల్గొని విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు. మరోవైపు భవిష్యత్ కార్యాచరణలో భాగంగా బుధవారం దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల బంద్‌కు హెచ్‌సీయు జేఏసీ పిలుపునిచ్చింది.