
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ మన్యం ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలను పూర్తిగా ఆపేయాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కరత్ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం బాక్సెట్ తవ్వకాల ప్రక్రియను వేగవంతం చేస్తోందని, దానిని వెంటనే ఆపాలని కోరుతూ ఆమె ఒక వినతి పత్రాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అందజేశారు.